Viral: అగ్గితో పెయింటింగ్..మాక్‌బుక్‌పై వింత ప్రయోగం..చివరకు ఏమైందో మీరే చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: లక్షలు పెట్టి కొన్న ఐఫోన్లు, లాప్‌టాప్‌లను జనాలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన యాపిల్ మాక్‌బుక్‌తో అసాధారణ సాహసం చేశాడు. దానిపై అగ్గితో పెయింటింగ్ వేసేందుకు ఓ ఆర్టిస్టుకు అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

పెయింటింగ్‌లో రకరకాల విధానాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. వాటిల్లో ఒకటి స్ప్రే పెయింటింగ్ (Spray painting). రంగు నింపిన ప్రెజరైజ్డ్ క్యాన్‌లను ఇందులో వాడతారు. కాన్‌లలోని ఇంకును స్ప్రే చేస్తూ పెయింటింగ్ వేస్తారు. ఇలా వేసే చిత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చిత్రించే విధానం కూడా అంతే అబ్బురపరుస్తుంది. ఈ కళాకారులు తమ పెయింట్‌ను ఆరబెట్టేందుకు ఒక్కోసారి అగ్గి కూడా వాడతారు. ఇలాంటి పెయింటింగ్ వేస్తున్న ఆర్టిస్టు టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన మాక్‌బుక్‌పైనే పెయింటింగ్ వేయమని అతడికి అప్పగించాడు. (Spraypainting on macbook with fire).

అత్యంత ఖరీదైన మాక్‌బుక్‌పై ఇలాంటి ప్రయోగానికి సిద్ధమైన అతడిని చూసి అక్కడున్న వారందరూ షాకైపోయారు. ఆర్టిస్టు అప్పుడప్పుడూ అగ్గి వాడుతుంటే మాక్‌బుక్ ఏమైపోతుందోనని అంతా భయపడ్డారు. కానీ, అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టిస్ట్ దానిపై ఓ కళాఖండాన్నే సృష్టించాడు. అద్భుతంగా ఉన్న డిజైన్‌ను చూసి మాక్‌బుక్‌ ఓనర్‌తో పాటూ అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. లాప్‌టాప్ ఓనర్ చేసిన సాహసానికి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours