Trending: ఆంటీ.. ఇన్ని నగలతో బయటకు రావద్దు…. ఈ దొంగల తెలివికి కళ్లు తేలేయాల్సిందే..

అందరూ దొంగల్లా తాళం వేసి ఉన్న ఇళ్లను దోచుకోవడంలో వెరైటీ ఏముంది అని అనుకున్నారో ఏమో ఈ దొంగలు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అనుకుంటూ వెరైటీ చోరీకి పాల్పడ్డారు. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో నుంచి గోల్డ్ చైన్ లాగేసే చైన్ స్నాచింగ్ బ్యాచ్ గురించి మనకు తెలిసిందే. కానీ ఈ చైన్ స్నాచింగ్ లోనే మరో తరహాలో దొంగతనం చేయవచ్చని నిరూపించారు ఈ యువకులు. ఇంతకీ పూర్తి విషయమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ చౌరీచౌరాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఓ మహిళ ముందు బండి ఆపారు. ఆమెను పలకరిస్తూ ఆంటీ.. మీరు ఇన్నిన్ని నగలు వేసుకుని బయటకు రావద్దు. పరిస్థితులు బాగా లేవు. ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తారు అని నమ్మించారు. వాటిని తీసి ఓ బ్యాగులో వేసుకోవాలని సూచించారు. వారి మాటలు నిజమేనని నమ్మిన ఆ మహిళ తన నగలన్నింటిని తీసి బ్యాగులో వేసింది. అంతే.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ యువకులు ఆ బ్యాగును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఊహించని ఘటనతో అవాక్కైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీను పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours