Kumari Aunty Food: హోటల్‌కు వస్తానన్న సీఎం రేవంత్.. కుమారీ ఆంటీ రియాక్షన్ ఇదీ..!

Hyderabad Famous Kumari Aunty: కుమారి ఆంటీ హోటల్.. రోడ్ సైడ్ ఉంటే ఓ చిన్న హోటల్ ఇది. ఇప్పుడీ హోటల్ తెలుగు రాష్ట్రాల్లో భాగా ఫేమస్ అయ్యింది. ఇన్‌స్టాగ్రమ్, యూట్యూబ్ లో వైరల్ అయిన ఈ హోటల్‌కు.. ఏకంగా సెలబ్రిటీలు వచ్చి భోజనం చేసే స్థాయికి వచ్చింది. రోజు రోజుకు కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. హోటల్ ఫేమస్ అవడంతో పాటు.. కష్టాలు కూడా వచ్చిపడ్డాయి. కస్టమరద్దీ కారణంగా.. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనిపై పలువురు కంప్లంట్ ఇవ్వగా.. పోలీసులు స్పందించారు. ఏకంగా హోటల్‌ను తీసేయాలంటూ ఆర్డర్స్ జారీ చేశారు. అంతేకాదు.. హోటల్ వ్యాన్‌ను తీసుకెళ్లిపోయారు.

దీంతో కన్నీటిపర్యంతం అయ్యారు హోటల్ నిర్వాహకురాలు కుమారి. అయితే, అధికారుల నిర్ణయం వైరల్ అవడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హోటల్ తీసేయొద్దని ఆర్డర్స్ జారీ చేశారు. తిరిగి హోటల్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాదు.. ఓ రోజు తానే స్వయంగా హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకురాలు కుమారి ఆంటీతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘గత 11 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో విపరీతంగా రద్దీ పెరిగింది. రోజు 400 నుండి 500 మందికి వంట చేసి ఫుడ్ అమ్ముతాము. నాన్ వెజ్‌లో చాలా వెరైటీలు చేసి కస్టమర్స్‌కి అందిస్తాము. నిన్న పోలీసులు హోటల్‌ని తీసేయాలంటూ మా హోటల్ వ్యాన్‌ను తీసుకెళ్లారు. హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ ఇక్కడి నుండి హోటల్ తొలగించాలని చెప్పారు. మళ్లీ హోటల్ పెడతామని అనుకోలేదు. నా విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం స్పందించడం గొప్ప విషయం. సీఎం మా హోటల్‌కి వచ్చి ఫుడ్ రుచి చూస్తా అనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా హోటల్‌ని యధా స్థితిలో కొనసాగించేలా అధికారులను ఆదేశించిన సీఎంకి కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డికి నచ్చిన వంట వంటి ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours