Divya Pahuja Murder Case: కాలువలో మాజీ మోడల్ మృతదేహం..11 రోజులకు లభ్యం, అసలేమైంది?

దేశంలో ఇటివల హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా(Divya Pahuja) కేసులో పోలీసులు విజయం సాధించారు. గత కొన్ని రోజులుగా దివ్య మృతదేహం కోసం వెతుకుతున్న పోలీసులకు 11 రోజుల తర్వాత ఈరోజు లభ్యమైంది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తోహానాలో పంజాబ్ నుంచి వస్తున్న భాక్రా కాలువ నుంచి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ క్రైం విజ్ ప్రతాప్ ఈరోజు ఉదయం తెలిపారు. దివ్య పహుజా శరీరంపై ఉన్న టాటూలను ఆధారంగా ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె మృతదేహాన్ని గుర్తించేందుకు గత కొన్ని రోజులుగా 100 మందికిపైగా గురుగ్రామ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Illegal Migration: 60 మంది నుంచి రూ.80 లక్షల చొప్పున వసూలు..అక్రమంగా అమెరికాకు 14 మందిపై కేసు

జనవరి 2న గురుగ్రామ్‌లోని ది సిటీ పాయింట్ హోటల్‌లో దివ్యను కాల్చి చంపారు. అప్పటి నుంచి గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన 6 బృందాలు ఆమె మృతదేహం కోసం వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. తాజాగా దివ్య మృతదేహాన్ని పారవేసిన నిందితుడు బాల్‌రాజ్ గిల్‌ను పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేశారు. బాల్‌రాజ్‌ను విచారించిన తర్వాతే పోలీసులు దివ్య మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. దివ్య మృతదేహాన్ని హర్యానాలోని తోహనా కాలువలో పడేసినట్లు అతను పోలీసులకు(police) తెలిపాడు.

దివ్యను హత్య చేసిన అభిజీత్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. దివ్య మృతదేహాన్ని పారవేసే బాధ్యతను బాల్‌రాజ్‌ గిల్‌కు అప్పగించాడు. బాల్‌రాజ్ గిల్ దేశం విడిచి పారిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే అరెస్టు అయ్యాడు. కోల్‌కతా విమానాశ్రయం నుంచి బల్‌రాజ్ గిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గురుగ్రామ్ ఏసీపీ (క్రైమ్) వరుణ్ దహియా తెలిపారు. పాటియాలా బస్టాండ్‌లో కారు పార్క్ చేసి పరారీలో ఉన్నాడు. అతని మరో సహచరుడు రవి బంగా ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

అయితే గతంలో వ్యాపారి అభిజీ‌త్‌తో రిలేషన్ కొనసాగించిన దివ్య పహుజా అతనితో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలను చూపించి డబ్బులు(money) డిమాండ్ చేసిందని విచారణలో తేలింది. ఆ క్రమంలో విసుగు చెంది ఆమెను ప్లాన్ ప్రకారం హోటల్‌కు రమ్మని హత్యకు ప్లాన్ వేసినట్లు అభిజీత్ ఒప్పుకున్నాడు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours