Bhadrachalam: అయోధ్య అక్షింతలకు.. కలశపూజ, శోభాయాత్ర

భద్రాచలం: భద్రాచలంలో సోమవారం శ్రీ అయోధ్య అక్షింతల, కలశపూజ, శోభాయాత్రను విశ్వహిందూపరిషత్‌, బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్ఎస్‌(RSS), హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. తాతగుడి వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అయోధ్య శ్రీరామచంద్రస్వామి వారి సేవిత అక్షింతలు పట్టణంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు శోభాయత్రగా బయలుదేరారు. ముందుగా అక్షింతలకు రామాలయ వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్‌, బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్ఎస్‌, హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

– సుజాతనగర్‌: శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న శ్రీరామ అక్షింతల పూజాయాత్ర సోమవారం సుజాతనగర్‌ మండలంలోని పాత అంజనాపురం, సర్వారం పంచాయతీలలో ఈ శోభాయత్ర వైభవంగా నిర్వహించారు. అక్షింతలతో పాటుగా అయోధ్యరామాలయ నమూనా, విగ్రహ ప్రతిష్ట అహ్వాన పత్రికను, అందించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి వేణు ఆచార్యులు, ట్రస్ట్‌ సభ్యులు, భక్తులు తాళ్లూరి ధర్మారావు, పోటు కేశవరావు, అమృనాయక్‌, భాస్కర్‌, ఇంటూరి జనార్దన్‌రావు, భూక్యా రాజేష్‌, ప్రసాద్‌, శ్రీనివాస్‌, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

vvvv.jpg

– చుంచుపల్లి : అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీ రామ జన్మభూమి అక్షింతలతో నిర్వహించిన శోభాయాత్రలో చుంచుపల్లి ఎంపీపీ బాదావత్‌ శాంతి సోమవారం పాల్గొన్నారు. విశ్వహిందు పరిషత్‌ – శ్రీ రామ తీర్థట్రస్ట్‌ ఆధ్వర్యంలో రుద్రంపూర్‌ ప్రధాన సెంటరు నుంచి ఈ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ప్రముఖులు బాదావత్‌ సీతారాములు, లట్టి జగన్‌మోహన్‌, పులికంటి శ్రీనివాస్‌, అయ్యప్ప దీక్ష గురుస్వామి గుమ్మడి శ్రీనివాస్‌, సుంకర శ్రీనివాస్‌, భజరంగ్‌దళ్‌ జిల్లా ప్రముఖ మెరుగు చింతేశ్వర్‌, రాజా, సత్యనారాయణ, తివారి, బడే రమేష్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

జూలూరుపాడు: అయోధ్య శ్రీరామచంద్రుని అనుగ్రహంతో వచ్చిన అక్షింతలతో సోమవారం మండలంలోని గుండెపూడి గ్రామంలో భక్తాంజనేయస్వామి ఆలయకమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. స్థానిక ఆలయంలో పురోహితుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకర్ల గ్రామంలో భక్తాంజనేస్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను గడపగడపకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్‌ తూము కోటయ్య, గ్రామస్తులు గాదె కృష్ణయ్య, వైస్‌ ఎంపీపీ గాదె నిర్మల, వేల్పుల గోపాల కృష్ణ, జువ్వాజి వీర రాఘవులు, కంచర్ల హరీష్‌, కళ్యాణపు నరేష్‌, జయశ్రీ, మహాలక్ష్మి, పద్మ, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours