Anand Mahindra: అయ్యబాబోయ్.. ఈ కుర్రాడి కడుపులో ట్రాక్టర్ ఏమైనా ఉందా? ఇతని ట్యాలెంట్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా..!

మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత, ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. చాలా ఆసక్తికరమైన, అరుదైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఒక కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకు ఆయన రాసిన క్యాప్షన్ చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

నెటిజన్లకు ఆనంద్ మహీంద్రాను(Anand Mahindra) ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో మంచి విషయాలు పంచుకుంటూ తన అనుచరులను ఉత్సాహపరుస్తుంటారు. కొన్ని సార్లు చాలా సరదా విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు మహింద్రా575డి(Mahindra575D) ట్రాక్టర్ మీద కూర్చున్నారు. ఒక కుర్రాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఉండగా మరొక కుర్రాడు అతని పక్కనే ఉన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లో ఉన్న కుర్రాడితో ఈరోజు మాకు మహీంద్రా575డి ట్రాక్టర్ శబ్దం చేసి చూపించు. అది కూడా ట్రాక్టర్ లో లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అదెలా శబ్దం చేస్తుందో చేసి చూపించు అని అడుగుతాడు. ఆ వెంటనే ఉన్నట్టుండి ఆ ట్రాక్టర్ స్టార్ట్ అయినట్టు, ట్రాక్టర్ కదులుతున్నట్టు శబ్దం వస్తుంది. దానికి తగ్గట్టే కుర్రాడు గేర్లు మారుస్తూ, హ్యాండిల్ తిప్పుతాడు. కానీ గమనిస్తే అక్కడ అసలు ఇంజిన్ స్టార్ట్ కాలేదు. ట్రాక్టర్ స్టార్ట్ అయిన శబ్దం, గేర్లు మారుస్తున్న శబ్దం, ట్రాక్టర్ కదులుతున్న శబ్దం అన్నీ ఆ కుర్రాడు తన నోటి ద్వారా సృష్టించినవే.

ఇది కూడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!

కుర్రాడు ట్రాక్టర్ లాగా చేసిన మిమిక్రీ ఆనంద్ మహీంద్రాకు భలే నచ్చేసిందట. అందుకే anand mahindra తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్లో ఈ వీడియో షేర్ చేసి ‘ఈ పిల్లాడి కడుపులో ట్రాక్టర్ ఉన్నట్టుంది’ అంటూ చమత్కరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఆనంద్ మహీంద్రా అనుచరులు తమ బాల్య జ్ఞాపకాలలోకి వెళ్లిపోయారు. కొందరు ఆ కుర్రాడి ట్యాలెంట్ ను గుర్తించి అతనికి సహాయం చెయ్యండి అని ఆనంద్ మహీంద్రాకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Coriander: వంటల్లో అలంకరణకే కాదండోయ్.. కొత్తిమీరను ఇలా వాడితే ఎన్ని లాభాలంటే,,!

మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours